Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 24, 2026Short Read
ఎన్నికల షెడ్యూల్‌పై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర ఎన్నికల సంఘం (EC) స్పష్టం చేసింది.
అధికారిక చిహ్నాలతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఎన్నికల తేదీలు నకిలీవని తేల్చిచెప్పింది.ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దని, అలాగే సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోరింది.
ఫేక్ వార్తలను వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారాన్ని అయినా కేవలం ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్ల ద్వారా మాత్రమే తెలియజేస్తామని ఈసీ స్పష్టం చేసింది.





